
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ఇవాళ ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే, అత్యుత్తమ సర్వీసులు అందచేసే పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందచేస్తోంది. ఇవాళ ప్రకటించిన అవార్డులలో ఏడుగురికి మహోన్నత సేవా పతకాలు, 50 మందికి కఠిన సేవా పతకాలు, 90 మందికి ఉత్తమ సేవా పతకాలు, 471 మందికి సేవా పతకాలను ప్రకటించింది.