కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్
  • కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ 
  • కేంద్రం మంజూరు చేసిన తర్వాత ఏడాదికి రాష్ట్ర సర్కార్ అనుమతి 

హైదరాబాద్, వెలుగు : పోయినేడాది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 20 కొత్త కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) ప్రారంభానికి రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీవో నెంబర్ 24 రిలీజ్ చేశారు. వాటి ఏర్పాటు కోసం రూ.60 లక్షలు విడుదల చేస్తామని అందులో పేర్కొన్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని మావల, జగిత్యాల జిల్లాలోని బీర్పూర్, బుగ్గారం, కరీంనగర్ జిల్లాల్లోని కొత్తపల్లి, గన్నేరువరం, మహబూబాబాద్ జిల్లాలో దంతాలపల్లి, మహబూబ్ నగర్​ జిల్లాలో మహ్మదాబాద్, మెదక్ జిల్లాలో నార్సింగి, నిజాంపేట, హవేలీ గన్ పూర్, మాసాయిపేట, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్ , సంగారెడ్డి జిల్లాలో నాగలిగిద్ద, మొగుడంపల్లి, చౌటకూర్, సిద్దిపేట జిల్లాలో దూలిమిట్ట, వికారాబాద్ జిల్లాలో చౌదాపూర్ మండలాల్లో కొత్త కేబీబీవీలు ప్రారంభం కానున్నాయి. కాగా, కొత్త కేజీబీవీల ప్రారంభంపై సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పోయిన నెల 31న ‘‘కొత్త కేజీబీవీల ప్రారంభం ఇంకెన్నడో!” శీర్షికతో వెలుగు కథనాన్ని ప్రచురించింది.