లిక్కర్ సేల్స్ లో రికార్డ్.. సర్కార్కు భారీగా ఆదాయం

లిక్కర్ సేల్స్ లో రికార్డ్.. సర్కార్కు భారీగా ఆదాయం

తెలంగాణ సర్కార్కు మద్యంపై ఆదాయం భారీగా వచ్చింది. ఈ ఏడాది మద్యంపై 34వేల కోట్ల ఆదాయం వచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు 34 వేల కోట్ల మధ్యం అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్లో నల్లగొండ జిల్లా ఉంది. 

రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా వస్తున్న డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. దీంతో మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. తర్వాతి నుంచి లిక్కర్ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. 2014–15లో రూ. 10.88 వేల కోట్లు రాగా.. 2018–19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. 2020–21లో లిక్కర్ ఆమ్దానీ రూ.27.28 వేల కోట్లకు చేరుకుంది. ఈ సారి 34 వేల కోట్లు వచ్చింది.

నిరుడు (2021–22) సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆదాయం వస్తే.. ఈ ఏడాది సగటున రూ.3 వేల కోట్లు సమకూరుతున్నది. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు రూ.21,763 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేశారు. ఇందులో 2.65 కోట్ల ఇండియన్‌‌‌‌ మేడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ (ఐఎంఎల్‌‌‌‌) కేసులు, 2.36 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 24 వరకు రూ.25,147 కోట్ల మద్యం సరఫరా కాగా, ఇందులో 2.52 కోట్ల ఐఎంఎల్‌‌‌‌ కేసులు, 3.48 కోట్ల బీరు కేసులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి కోటి 12 లక్షల బీర్ కేసులు ఎక్కువగా అమ్ముడుపోయాయి.