గ్రూప్ -4 పోస్టులను పెంచుతున్న సర్కార్

గ్రూప్ -4 పోస్టులను పెంచుతున్న సర్కార్
  • కొత్త వేకెంట్ పోస్టులు కలిపితే 9,800 దాటే చాన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4  పోస్టుల సంఖ్యను రాష్ట్ర సర్కార్ పెంచుతున్నది. నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటం, జిల్లా స్థాయి పోస్టు కావడం, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో వేకెంట్ పోస్టులను పెంచుతోంది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చూపింది. ఇప్పుడు వీటికి అదనంగా 600–700 పోస్టులు వచ్చే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 9,800 దాటుతుందని అంటున్నారు. ఇటీవల సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆఫీసర్లతో గ్రూప్ 4 పోస్టులపై ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కొందరికి ప్రమోషన్లు ఇచ్చి అయినా సరే పోస్టుల సంఖ్య పెంచాలని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓడీలను ఆదేశించారు.

ఉద్యోగాల భర్తీ చేస్తున్నారనే ఫీలింగ్ రావాలె

రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తున్నట్లు 2 నెలల కిందట సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి 39 వేల ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది. ఇందులో గ్రూప్​1, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ నిరుద్యోగుల్లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫీలింగ్ రావడం లేదని, ఈ పోస్టులు సరిపోవని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. జిల్లా స్థాయిలో గ్రాడ్యుయేట్లు, ఇంటర్ పూర్తయిన వాళ్లు కూడా ఈ పోస్టులకు అర్హత ఉండటంతో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో ఈ నెలఖారులో లేదా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 కల్లా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆఫీసర్లు ప్లాన్ చేసుకున్నారు. కానీ జూన్ 15 తర్వాతే నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ నెల 29 కల్లా రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలు రెడీ చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. తర్వాత చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటంతో ఆలస్యం అవుతుందని ఆఫీసర్లు  అంటున్నారు.

బీసీ సంక్షేమ శాఖలో 21 పోస్టులు పెరిగినయ్

గ్రూప్ 4 పోస్టుల సంఖ్య విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జూనియర్ అసిస్టెంట్, దాని సమాన స్థాయి పోస్టుల లిస్ట్ పంపాలని గతంలో ఆర్థిక శాఖ ఆదేశించింది. అయితే టెక్నికల్ పోస్టులనూ కలిపి పంపినట్లు తర్వాత ఆఫీసర్లు గుర్తించారు. దీంతో వాటిలో కొన్నింటిని తీసేశారు. అదే టైంలో వివిధ డిపార్ట్​మెంట్లలో వేకెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుర్తించిన పోస్టుల కంటే ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు. వాటిని రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ చేయాలని సీఎస్ ఆదేశించడంతో మళ్లీ లిస్ట్ పంపిస్తున్నారు. అలా ఒక్క బీసీ సంక్షేమ శాఖలోనే 21 పోస్టులు ఎక్స్​ట్రా వచ్చాయి. ఇలా అన్ని శాఖల నుంచి కనీసం 700 పోస్టులు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.