
ఆర్టీఐ కమిషనర్లుగా కొత్తగా నలుగురిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస రావు , మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలను నియమించింది. ఏడుగురిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం నలుగురిని నియమించింది. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ రావు సీనియర్ జర్నలిస్టు కాగా.. యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి సీఎం సీపీఆర్వోగా ఉన్నారు. మైనార్టీ కోటాలో పర్వీన్ మొహిసిని ప్రభుత్వం ఎంపిక చేసింది.
ALSO READ | గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ.. మిస్ వరల్డ్ ముగింపు వేడుకకు ఆహ్వానం..
మే 5న ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన చంద్రశేఖర్‌రెడ్డి ఏప్రిల్ 30 వరకు పీసీసీఎఫ్‌గా, అంతకుముందు సీఎంవో సెక్రటరీగా పనిచేశారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగాన్ గ్రామం.
గత రెండేండ్లుగా సమాచార కమిషన్‌లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆలస్యంపై సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసి, నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చే సేందుకు ఎంపిక చేసిన వారి జాబితాను రాష్ట్ర సర్కారు రాజ్‌భవన్‌కు పంపింది. రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కమిషనర్లను ప్రభుత్వం నియమించింది.