గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ.. మిస్ వరల్డ్ ముగింపు వేడుకకు ఆహ్వానం..

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ.. మిస్ వరల్డ్ ముగింపు వేడుకకు ఆహ్వానం..

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( మే 12 ) రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అయినట్లు తెలుస్తోంది.దీంతో పాటు ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో చర్చించిన సీఎం.. మిస్ వరల్డ్ 2025 వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల మధ్య హైదరాబాద్ లో మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ భేటీలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా .. శనివారం (మే10) సాయంత్రం గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025  72వ ఎడిషన్‌ అందాల పోటీల కోలాహలం మొదలయ్యింది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆథిత్యం వహిస్తుండగా.. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా  జరగనున్న ఈ వేడుకను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

►ALSO READ | జవాన్లు క్షేమంగా ఉండాలని.. మోకాళ్లపై గుడికి వెళ్లిన యువతులు

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర  అధికారులు ఈ కార్యక్రమాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈవెంట్ ని ప్రారంభించారు.ఆ తర్వాత దాదాపు 250 మంది కళాకారులు తెలంగాణ సాంప్రదాయ నృత్య పేరిణి ప్రదర్శించారు. అనంతరం వివిధ దేశాల అందగత్తెలు తమ ఫ్యాషన్  కాస్ట్యూమ్స్ లో ర్యాంప్ వాక్ చేస్తూ అలరించారు.