జవాన్లు క్షేమంగా ఉండాలని.. మోకాళ్లపై గుడికి వెళ్లిన యువతులు

జవాన్లు క్షేమంగా ఉండాలని.. మోకాళ్లపై గుడికి వెళ్లిన యువతులు

లక్సెట్టిపేట, వెలుగు: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయినందుకు ముగ్గురు అమ్మాయి లు మరో అన్నవరంగా పేరు. పొందిన దండేపల్లిలోని గూడెం శ్రీ రమా సహితసత్యనారాయణ స్వామి గుడిని మోకాళ్లపై ఎక్కి మొక్కు చెల్లించుకున్నారు. లక్సె ట్టిపేట పట్టణానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి నరేందుల సాహితి, కార్యనిర్వాహక కార్యదర్శి అక్కినపల్లి రాధిక, మరో మిత్రురాలు అశ్విత కలిసి ఆదివారం గుడి 210 మెట్లను మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు తీర్చుకున్నారు. దేశ సంక్షేమం కోసం, భారత జవాన్ల క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.