
హైదరాబాద్, వెలుగు: 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాల్గొనాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములు కావాలని కోరుతూ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు.
‘‘ఈ నెల 10న సిటిజన్ సర్వే ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఈ నెల 25 వరకు జరిగే విజన్- 2047 సర్వేలో పాల్గొనాలి. అలాగే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో సర్వే లింక్ (http://www.telangana.gov.in/telanganarising/) ను, క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించి.. సర్వేకు విస్తృత ప్రచారం నిర్వహించాలి” అని సీఎస్ పేర్కొన్నారు.