తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేయాలి..డిసెంబర్ 31 డెడ్ లైన్

తెలంగాణ ప్రభుత్వం  కీలక నిర్ణయం..అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేయాలి..డిసెంబర్ 31 డెడ్ లైన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను నిర్వహించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 31 లోపు రెంటెడ్ బిల్డింగులలో నిర్వహిస్తున్న అన్ని శాఖల ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆఫీసులన్నీ  విజయవాడకు వెళ్లి పోగా ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు హైదరాబాద్ సిటీలో  అవసరమైన వసతులున్నాయని తెలిపింది. 

 డిసెంబర్ 31 లోగా అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, సీఎస్ లు కార్యదర్శులు, డిపార్టుమెంట్ల  ఉన్నతాధికారులు ఆఫీసుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి తక్షణమే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది ఆర్థిక శాఖ. 

ALSO READ : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆదిలాబాద్ జిల్లా నేతలు..

జనవరి 1 నుంచి ఖచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే ఆఫీసులు కొనసాగాలని స్పష్టం చేసింది.  మరోవైపు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన అద్దెను ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేయాలని ట్రెజరరీ విభాగానికి కూడా సర్క్యులర్ జారీ చేసింది. 

ప్రభుత్వం తన ఆఫీసులకు వసతి కల్పించే ప్రైవేట్ భవనాల అద్దె పేరుతో ఏటా భారీ మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది .. ఈ అద్దెలను తగ్గిస్తే ఖజానాకు భారీ మొత్తం ఆదా అవుతుంది. విభజన తర్వాత గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తన కార్యాలయాలను ఖాళీ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలని సర్క్యులర్ లో తెలిపింది. 

ఏపీ ఆఫీసులు విజయవాడకు వెళ్లిపోవడంతో పరిశ్రమ్ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కే భవన్ ఎర్రమ్ మంజిల్ వంటి భవనాలు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. ఇప్పుడు ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆఫీసులను తరలించేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా డిపార్టుమెంట్ల అధిపతులు స్థలాలను పరిశీలించి తమ ఆఫీసులను తరలించే ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది.