అమరుల కుటుంబాలకు సర్కారు అండ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అమరుల కుటుంబాలకు సర్కారు అండ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

యాదాద్రి, వెలుగు :  తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల  త్యాగాలు మరువబోమని, అమరుల కుటుంబాలకు సర్కారు అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మోత్కూరు లో నిర్వహించిన రాష్ట్ర  మహిళ కమిషన్ సభ్యుడు కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేత అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందని భావించి అనేక మంది స్వరాష్ట్రం  కోసం ప్రాణాలను త్యాగం చేశారన్నారు. 

తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వీర నారి  చాకలి అయిలమ్మ, మలి దశ తెలంగాణ  ఉద్యమంలో అమరుడు శ్రీకాంతాచారి ప్రాణాలు త్యాగం చేశారని మంత్రి గుర్తు చేశారు. గద్దర్, అందెశ్రీ తో పాటు పలువురికి ప్రభుత్వం పారితోషకం అందించామని  తెలిపారు. ఉద్యమంలో  ప్రాణాలు అర్పించిన అమరుడు శ్రీకాంతాచారి  తల్లి శంకరమ్మ, చాకలి అయిలమ్మ వారసురాలు శ్వేతను మహిళ కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు.