V6 News

టీజీఎస్ఆర్టీసీ సమస్యలపై అధికారుల కమిటీ... జీవో విడుదల చేసిన ప్రభుత్వం...

టీజీఎస్ఆర్టీసీ సమస్యలపై అధికారుల కమిటీ... జీవో విడుదల చేసిన ప్రభుత్వం...

టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. అధికారుల కమిటీకి సంబంధించి జీవో ఏం.ఎస్ నెం: 66 విడుదల చేసింది ప్రభుత్వం. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నుంచి వారి సేవ నిబంధనలు, సంబంధిత విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి పలు వినతులు అందుతున్నాయని.. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి తగు సిఫార్సులను సూచించటానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

ALSO READ : ఈ జిల్లాల్లో ఎండలు తగ్గి వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ !

అధికారుల కమిటీలో సభ్యులు: 

చైర్మెన్:

  • ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు, భవనాల శాఖ 

సభ్యులు:

  • ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ
  • వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు & కన్వీనర్

కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలని తెలిపింది ప్రభుత్వం.