ఉద్యోగాలకు సిలబస్, పరీక్ష విధానం ప్రకటించిన ప్రభుత్వం

ఉద్యోగాలకు సిలబస్, పరీక్ష విధానం ప్రకటించిన ప్రభుత్వం

హైద‌రాబాద్: ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ విధానంపై సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పోస్టుల వ‌ర్గీక‌ర‌ణ‌, ప‌రీక్షా విధానంతో పాటు సిల‌బ‌స్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గ్రూప్-1లో 19 ర‌కాల పోస్టులు, గ్రూప్-2లో 16 ర‌కాల పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. గ్రూప్-1 పోస్టుల‌కు 900 మార్కుల‌తో, గ్రూప్-2 పోస్టుల‌కు 600 మార్కుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ఇంట‌ర్వ్యూల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక గ్రూప్-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులకు రాత పరీక్ష, గ్రూప్-4లో జూనియర్ అసెస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

మరిన్ని వార్తల కోసం...

కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ కు కొత్త కమిటీలు

"ప్రజా సంగ్రామ యాత్ర" వాయిదా వార్తల్లో నిజం లేదు

టీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు