ఉద్యోగాల భర్తీ.. మళ్లీ పాత పాటే

ఉద్యోగాల భర్తీ.. మళ్లీ పాత పాటే

మరోసారి  ఉద్యోగాల  భర్తీ నినాదాన్ని  ఎత్తుకుంది రాష్ట్ర ప్రభుత్వం.  గతేడాది డిసెంబర్ లో .. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికీ ఏడు నెలలు అవుతున్నా.. ఒక్క నోటిఫికేషన్ రాలేదు. కానీ 50 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని సీఎం చెప్పారంటూ మరో నోట్ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం. నోటిఫికేషన్లు ఇచ్చినా సవాలక్ష అడ్డంకులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీకి చాలా సాంకేతిక సమస్యలున్నాయంటున్నారు. కొత్త జోన్లకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేడర్ ను విభజన చేయలేదు. పోస్టుల కేటగిరీల వారీగా విభజించలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఏది జిల్లా పోస్ట్ అనే విషయంపైనా క్లారిటీ లేకుండా పోయింది. దీంతో సర్కారుకు నిజంగానే ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆసక్తి ఉందా..? అనే దానిపై విమర్శులు వస్తున్నాయి.