
- పెద్దఅంబర్ పేటలో పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ప్రారంభం
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: పౌల్ట్రీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పెద్ద అంబర్ పేటలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ నూతన భవనాన్ని ఆదివారం రోడ్డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డితో కలిసి ప్రారంభించారు. పౌల్ట్రీ పరిశ్రమ పితామహుడు బీవీ.రావు సేవలు మరువలేనివన్నారు.
పౌల్ట్రీ రైతులకు విద్యుత్ సబ్సిడీ, హెచ్ఎండీఏ పరిధిలో నిర్మించే షెడ్లకు పర్మిషన్అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్రాష్ట్ర అధ్యక్షుడు కాసర్ల మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్క సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.