టీచర్​ నిరుద్యోగులకు శుభవార్త: తెలంగాణ టెట్​ నోటిఫికేషన్​ విడుదల

టీచర్​ నిరుద్యోగులకు శుభవార్త: తెలంగాణ టెట్​ నోటిఫికేషన్​ విడుదల

తెలంగాణ టెట్ పరీక్ష(Telangana TET 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. డీఎస్సీ కంటే ముందే ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో…  విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్  విడుదల చేసింది. టెట్ నిర్వహించటం ద్వారా… చాలా మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కిందిదాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనంపొందనున్నారు.టెట్​ నోటిఫికేషన్​ విడుదల కావడంతో జూన్​ 6 వరకు డీఎస్సీ దరఖాస్తుల గడువు పెంచారు.  ఈ నెల 27 నుంచి ఏప్రిల్​ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  మే 20. జూన్​ 3న  పరీక్ష నిర్వహించనున్నారు. 

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో…టెట్ ( TS TET )పరీక్ష నిర్వహణ కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గతంలో పరీక్ష రాసి అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులే కాకుండా… ప్రస్తుతం డీఈడీ, బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ నిర్వహించాలని గట్టిగా కోరుతున్నారు. … మెగా డీఎస్సీ(Telangana DSC 2024) కూడా రాసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావటానికి చాలా సమయం పడుతుందని… ఫలితంగా తమకు ఇప్పుడే టెట్ రాసే ఛాన్స్ ఇస్తే… ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడతామని అంటున్నారు. ఇదే విషయంపై ప్రభుత్వంలోని మంత్రులతో పాటు అధికారులకు కూడా వినతిపత్రాలను ఇచ్చారు. 

టెట్ పరీక్షలను నిర్వహించాలనే డిమాండ్ తో ఇటీవలే అభ్యర్థులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.  టెట్ నోటిఫికేషన్(TS TET Notification 2024) కోసం అభ్యర్థుల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున రావటంతో ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగనే… టెట్ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది.