రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 30 నుంచి రైతు భరోసా

రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 30 నుంచి రైతు భరోసా

 

  • మధిరలో రైతు సమ్మేళనం.. అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం
  • మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
  • ఏడు రకాల సన్నాలకే 
  • రూ.500 బోనస్
  • ఉపాధి హామీ అమలులో మార్పులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ
  • ఢిల్లీ వెళ్లి యూరియా, మెట్రోపై 
  • కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం 
  • ఇకపై డిజిటల్ మోడ్​లో 
  • రాష్ట్ర కేబినెట్ సమావేశాలు​
  • నీట్ రాసే 2.95 లక్షల మంది 
  • స్టూడెంట్స్​కు ఫ్రీ బస్సు 
  • వివరాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క

హైదరాబాద్, వెలుగు:అన్నదాతలకు వానాకాలం పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో   ‘రైతు సమ్మేళనం’ నిర్వహించి, ఆ సభా వేదిక నుంచే రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ జమ చేయనుంది. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన సెక్రటేరియెట్​లో మంత్రులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, మార్కెట్​లో డిమాండ్​ఉన్న ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్ వర్తింపజేయనున్నారు. 

కేంద్రం అనుసరిస్తున్న ధాన్యం సేకరణ విధానాలు, ఎరువుల కోటా కేటాయింపులు, మెట్రో రుణం మంజూరు నిలుపుదలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర హక్కుల సాధన కోసం ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించింది. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసిరావాలని కోరింది. ఇకపై కేంద్రం మద్దతు ధర ప్రకటించి సేకరించే పంట ఉత్పత్తులను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. 

వీబీ జీ-రాంజీ కొత్త చట్టం అమలు వల్ల కూలీలపైనా, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎంతో సమావేశం అనంతరం మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క మీడియాతో మాట్లాడారు. 

ఆ ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్

మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్​ ఉన్న ఏడు సన్నరకాలను మాత్ర మే ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీపీటీ-5204 , ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్-15048, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంటీ సోనా, జై శ్రీరామ్,  కేఎన్‌‌‌‌‌‌‌‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌‌‌‌‌‌‌‌ఎం-7715 రకాలకే రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి చెప్పారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని.. కానీ, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  

మెట్రో విస్తరణకు కలిసిరండి.. బీజేపీ ఎంపీలకు విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీ ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మెట్రో ఫేజ్-2 విస్తరణ అత్యంత కీలకమని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో మెట్రో విస్తరణకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ  నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా.. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కలిసిరావాలని, మెట్రో విస్తరణకు సహకరించాలని కోరారు. 

నీట్ అభ్యర్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఈ నెల 21న దేశవ్యాప్తంగా ‘నీట్’ పరీక్ష జరుగుతుందని, రాష్ట్రంలో దాదాపు 208 పరీక్ష కేంద్రాల్లో 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారని మంత్రి ఉత్తమ్​ పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  

ఉపాధి హామీ పేరు మార్పుపై వ్యతిరేకత.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని  మంత్రి సీతక్క విమర్శించారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన  ఈ చట్టంలోని వంద రోజుల ఉపాధి హక్కును  నిర్వీర్యం చేయడంతో పాటు మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా దాని ఆత్మను, స్ఫూర్తిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ కొత్త విధానం పేదల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా, రాష్ట్రాలపై అదనపు ఆర్థిక, పరిపాలనా భారం మోపే ప్రమాదం ఉందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ, జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరమన్నారు.

 ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్​ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని సీతక్క తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ వెంకటస్వామి, తాను సభ్యులుగా ఉన్న ఈ కమిటీ వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, చర్చలు జరిపి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రాలపై అదనపు భారం మోపకుండా, కూలీల హక్కులకు భంగం కలగకుండా ఏ మార్పులు తీసుకురావాలన్న దానిపై కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

తొందరపడి విత్తనాలు వేయవద్దు: మంత్రి తుమ్మల

ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ  హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తొలకరి వర్షం పడగానే తొందరపడి విత్తనాలు వేయవద్దని, భూమిలో తగినంత పదును లేకపోతే మొలక శాతం దెబ్బతింటుందని హెచ్చరించారు. కనీసం 7 మిల్లీమీటర్ల వర్షపాతం రెండు సార్లు నమోదైతేనే విత్తనాలు వేయాలని, రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని కోరారు.

డిజిటల్ బాటలో కేబినెట్.. ఇక అంతా పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెస్ 

పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని, ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా ‘పేపర్ లెస్’గా నిర్వహించబోతున్నామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. కేబినెట్ సమావేశాలన్నింటినీ ఇకపై ‘తెలంగాణ డిజిటల్ కేబినెట్’గా నిర్వహిస్తారని వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందజేసినట్లు తెలిపారు. మంత్రులంతా డిజిటల్ కేబినెట్ అమలు తీరును స్వయంగా పరిశీలించారని చెప్పారు. ఇకపై ‘ఈ- బుక్’ ద్వారానే కేబినెట్ సమావేశం అజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంటాయన్నారు. పేపర్ లెస్ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమల్లోకి తీసుకురావడం సంతోషకరమని మంత్రి వెల్లడించారు. 

2 లక్షల మెట్రిక్​ టన్నులకు లక్ష కూడా ఇస్తలేరు..‌‌‌‌‌‌‌‌ 

రాష్ట్రానికి ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత కోటాను సకాలంలో అందించడం లేదని మంత్రి తుమ్మల ఆరోపించారు. నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని కేంద్రం వాగ్దానం చేసినప్పటికీ, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లక్ష టన్నులకు మించి సరఫరా చేయలేదన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి అందాల్సిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు  లేఖలు రాశామన్నారు. 

అయినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేసేలా త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీ (ఆర్​ఎఫ్​సీఎల్​)లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో మొత్తం కోటాను తెలంగాణకే కేటాయించాలని డిమాండ్  చేశారు.