4 వారాల్లో వినియోగదారుల కమిషన్‌ చైర్మన్ ను నియమిస్తం

4 వారాల్లో వినియోగదారుల కమిషన్‌ చైర్మన్ ను నియమిస్తం

హైదరాబాద్, వెలుగు: నాలుగు వారాల్లో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ చైర్మన్ ను నియమిస్తామని రాష్ట్ర సర్కార్‌ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని  చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రికార్డుల్లో నమోదు చేసింది. హామీని అమలు చేసి వివరాలను నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ALSO READ :మణిపూర్ అల్లర్ల బాధ్యులను ఉరి తీయాలి: విజయశాంతి

రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ చైర్మన్ పోస్టును వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన అడ్వొకేట్‌ బగ్గేకర్‌ ఆకాశ్ కుమార్‌ ఇటీవల కోర్టులో  పిల్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భం గా నియామక ప్రక్రియ మొదలైందని ప్రభుత్వ అడ్వొకేట్‌ హరేందర్‌ పరిషద్‌ కోర్టుకు చెప్పారు. నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సందేహాలు ఉన్నందున తుది నిర్ణయం తీసుకోలేదని విన్నవించారు.