తెలంగాణలో కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ .. తెలంగాణ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో పనిచేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్తో మన విజన్ ఆవిష్కరించామని చెప్పారు. 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంతో పనిచేస్తూ వికసిత్ భారత్ కు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
గవర్నర్ స్పీచ్ హైలైట్స్:
- రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో పనిచేస్తున్నాం
- గ్లోబల్ సమ్మిట్ తో మన విజన్ ఆవిష్కరించాం
- RRR పూర్తి చేసి అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం
- క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో ముందుకెళ్తున్నాం..
- డిసెంబర్ 9న ఘనంగా తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు
- అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నాం
- మేడారంలో చారిత్రాత్మకంగా కేబినెట్ నిర్వహించుకున్నాం
- ఆదివాసీ జాతర మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తున్నాం
- వందల కోట్లతో మేడారం గద్దెలను ఆధునీకరించాం
- వ్యవసాయ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నాం
- సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం
- బలమైన ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించి అమలు చేస్తున్నాం
- మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం
- పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నాం
- విజయవంతంగా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాం
- గ్రూప్ -1, 2, 3 ఉద్యోగాలు భర్తీని పూర్తి చేశాం..
- 65 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం
- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నాం
- ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా వర్సిటీని తీర్చి దిద్దుతాం
- ధరణి స్థాణంలో భూభారతి తీసుకొచ్చాం
- ఐటీఐలను అభివృద్ధి చేసి యువతకు ఉపధి కల్పిస్తున్నాం
- రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నాం
- ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నాం
