హైదరాబాద్, వెలుగు: దీపావళి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో దేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గవర్నర్ శుక్లా ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా గవర్నర్ ఫోన్ చేసి విషెస్ చెప్పారు. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరారు.
