గణతంత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

V6 Velugu Posted on Jan 26, 2022

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. కరోనాను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందన్నారు. వ్యాక్సినేషన్ లో మనం ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వ్యాక్సినేషన్ లో త్వరలోనే 2వందల కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నామన చెప్పారు గవర్నర్. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఎందగటం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యా వ్యవస్థలో తెలంగాణ ముందువరుసలో నిలిచిందన్నారు గవర్నర్ తమిళిసై. 

 

Tagged Hyderabad, Telangana, flag, governor, Raj Bhavan, unveils, TAMILSAI

Latest Videos

Subscribe Now

More News