Sankranthi Movies OTT: ఈ వారమే ఓటీటీలోకి సంక్రాంతి మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడాలంటే?

Sankranthi Movies OTT: ఈ వారమే ఓటీటీలోకి సంక్రాంతి మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడాలంటే?

భారీ అంచనాల మధ్య రిలీజైన సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇందులో ఓ మూడు సినిమాలు విశేషంగా ప్రేక్షకులను అలరించినప్పటికీ, మరో మూడు సినిమాలు టాక్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ 6 సినిమాలు తమ థియేటర్ లాంగ్ రన్ని ఆల్మోస్ట్ పూర్తిచేసుకున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి సినిమాలన్నీ ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమయ్యాయి. ముందుగా ఈవారం ఓ మూడు సినిమాలు వస్తుండగా, మిగతావి నెక్స్ట్ వీక్ రానున్నాయి. మరి ఈ వారం (ఫిబ్రవరి ఫస్ట్ వీక్) ఓటీటీలో విడుదలయ్యే సంక్రాంతి సినిమాలు ఏంటి? అవెక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్కి రానున్నాయి? అనేది వివరాలు చూసేద్దాం. 

నారీ నారీ నడుమ మురారి= అమెజాన్ ప్రైమ్

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కామెడీ-ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి'. ఈ ఏడాది సంక్రాంతి రేసులో సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ. శర్వానంద్ మార్క్ టైమింగ్, రామ్ అబ్బరాజు మేకింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ద సినిమాలతో పోటీపడి మరీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ తెరపై సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

నిర్మాత అనిల్ సుంకర పెట్టిన పెట్టుబడికి ఈ సినిమా డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భార్యాభర్తల గొడవలు, మధ్యలో నలిగిపోయే హీరో పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేయండి. 

ది రాజా సాబ్= జియో హాట్‌స్టార్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో మిక్సెడ్ టాక్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నెలరోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానునట్లు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్కి ఇంకొంచెం టైం పట్టె అవకాశం ఉంది. 

‘పరాశక్తి’= జీ5

శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘పరాశక్తి’. ఈ పీరియాడిక్ సోషల్ డ్రామా కూడా ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఈ క్రమంలోనే మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.

ఇక వచ్చే వారం ఓటీటీలోకి మరికొన్ని సంక్రాంతి సినిమాలు రానున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు, అలాగే రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి సినిమాలు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ చిత్రాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు, రిలీజ్ డేట్లు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.