బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం  బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించింది. గతంలో హామీ ఇచ్చినట్లుగా ఈ ఏడాది కూడా రూ. 75వేలలోపు రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గత ఏడేళ్లుగా వ్యవసాయానికి భారీ ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని మంత్రి చెప్పారు. గత 8 సీజన్లలో రైతు బంధు పథకం కింద 63లక్షళ మంది రైతుల ఖాతాల్లో రూ.50,448 కోట్లు జమ చేసినట్లు హరీష్ రావు ప్రకటించారు. రైతు భీమా పథకం ద్వారా అన్నదాతలు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటి వరకు 75వేల కుటుంబాలకు రూ.3,775కోట్లు అందజేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

2022 -23 సంవత్సరంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బడ్జెట్ లో రూ.1000కోట్లు కేటాయించింది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహిస్తున్న రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.

For more news..

కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు!

పేషెంట్ల డైట్ ఛార్జీలు రెట్టింపు