- సాలిడ్ వేస్ట్ మేనే జ్ మెంట్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ లోని 86 ఎకరాల భూమిలో జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్(ఎస్‌డబ్ల్యూఎం) కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో 641ను జారీ చేసింది.
సర్వే నంబర్లు 252, 278, 361లోని 86 ఎకరాల భూమిని ఎకో-టౌన్ ప్రాజెక్టు కోసం జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు. జపాన్‌లోని కిటాక్యూషూ నగరం– రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన సహకార ఒప్పందంలో భాగంగా ఈ ఎకో-టౌన్ అభివృద్ధి చేయనున్నారు.
