
రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు ప్రయోజనం కలిగించేలా నీరా పాలసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నీరా అమ్మకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ముందుగా హైదరాబాద్ లో నీర అమ్మకాలు మొదలుకానున్నాయి. ట్యాంక్ బండ్ మీద ఎక్సైజ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నీరా ఔట్ లెట్ ప్రారంభించబోతున్నారు. నీరా పాలసీపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.
నీరా పాలసీ వివరాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. “ఈత, తాటి చెట్ల నుంచి నీరా తయారు చేస్తుంటారు. నీర అనేది ఔషధం. మద్రాస్ లేబరేటరీ కూడా నీరా శాంపిల్స్ కు పరీక్షలు చేసింది. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆరోగ్యానికి మంచిదని రిపోర్టులో తేలింది. నీరా క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఇతర జబ్బులు కూడా రావని లేబరేటరీ రిపోర్ట్ వచ్చింది. కూల్ డ్రింకుల్లో క్రిమి సంహారక మందులు ఉంటాయి. ఇవి ప్రమాదం. నీరా లో ఏమీ ఉండదు. ఆరోగ్యానికి మంచిది. ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్న వారికి అండగా ఉండేందుకు నీరా పాలసీ తీసుకొస్తున్నాం. లైసెన్స్ తీసుకొని నీరా అమ్మకాలు చేయాలని. గౌడ కులస్తులకు మాత్రమే నీరా అమ్మక హక్కులు ఉంటాయి. అన్ని రకాల వంటకాలతో నీరా కోసం చిన్న రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నాం”అని చెప్పారు శ్రీనివాస్ గౌడ్.