
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అదనపు డీజీ క్యాడర్ పదోన్నతి కల్పించింది. జోయల్ డేవిస్, ప్రకాశ్ రెడ్డిలను డీఐజీలుగా.. సత్యనారాయణ, సుమతి, రంగనాథ్, కార్తికేయ, రమేశ్ నాయుడుకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.