వ్యవసాయ శాఖలో 88 మందికి ప్రమోషన్ .. మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

వ్యవసాయ శాఖలో 88 మందికి ప్రమోషన్ .. మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖలో గత పదేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న 88 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం అగ్రిడాక్టర్స్​ అసోసియేషన్ స్థాపకులు, ఆగ్రోస్​వీసీ, ఎండీ కే. రాములు ఆధ్వర్యంలో టాడా అధ్యక్షుడు సాల్మోన్ నాయక్, కార్యదర్శి తిరుపతి నాయక్ లు మంత్రి తుమ్మలను పూలబోకే, శాలువతో సత్కరించారు. ప్రమోషన్లు పొందినవారిలో ఒక అడిషనల్ డైరెక్టర్, 18 జాయింట్ డైరెక్టర్లు, 42 డిప్యూటీ డైరెక్టర్లు, 27 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. 

గతంలో జాయింట్, డిప్యూటీ డైరెక్టర్ ప్రమోషన్లు 2016లో, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్లు 2018లో జరిగాయి. సుదీర్ఘకాలం తర్వాత జరిగిన ఈ ప్రమోషన్లు శాఖ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపాయని, ప్రభుత్వ కార్యక్రమాలు మరింత చురుగ్గా నిర్వహించేందుకు ప్రమోషన్లు దోహదపడతాయని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. సమావేశంలో అసోసియేషన్ స్థాపకులు రాములు, అధ్యక్షుడు సాల్మోన్ నాయక్, కార్యదర్శి తిరుపతి నాయక్, కోశాధికారి మధుమోహన్ పాల్గొన్నారు.