హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్ యూఎఫ్ఐడీసీ)కు హడ్కో నుంచి రూ.1000 కోట్ల రుణం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులను ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అర్బన్ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం, ఇతర అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం ఉపయోగించనున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, నీటి సరఫరా, ఇతర పట్టణ అవసరాలను మెరుగుపర్చడానికి ఖర్చు చేయనున్నట్టుగా ఆఫీసర్లు తెలిపారు.
