ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణలో 50 రోజులకు పైగా సమ్మె చేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి.. ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో జరిపిన చర్చలలో తెలిపారు. ఆ మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఇటీవల చేసిన సమ్మె కాలానికి సంబంధించిన రూ.235 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
For More News..
