4 వేల మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్

4 వేల మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్
  • ఒక్కో సంఘానికి 15 వేల చొప్పున 6 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 4,079 మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ. 6.11 కోట్ల  రివాల్వింగ్ ​ఫండ్ ​విడుదల చేసింది. ఇందులో ఒక్కో సంఘానికి  రూ.15 వేల చొప్పున కేటాయించనున్నది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు,  జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షించనున్నాయి. 32 జిల్లాలకు చెందిన 4,079 స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద నిధులు కేటాయించగా..ఇందులో  అత్యధికంగా  మహబూబాబాద్ జిల్లాలోని 397 సంఘాలకు  అందనున్నాయి.   తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాలకు అందించనున్నారు.  మంచిర్యాలలో కేవలం 3 సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది.