ఫ్యూచర్ సిటీ అథారిటీకి 36 పోస్టులు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఫ్యూచర్ సిటీ అథారిటీకి 36 పోస్టులు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్ సీ డీఏ)కి 36 పోస్టులు మంజూరు చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఫ్యూచర్ సిటీకి పోస్టులు మంజూరు చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎఫ్ సీడీఏ కమిషనర్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారని అందులో తెలిపారు. అడిషనల్ కమిషనర్, అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్, ఫైనాన్షియల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ తో పాటు పలు పోస్టులు మంజూరైన వాటిలో ఉన్నాయి. ఈ పోస్టులను జనరల్ అడ్మినిస్ర్టేషన్ వింగ్, ఫైనాన్షియల్ వింగ్, ఎస్టేట్ ఆఫీసర్, లీగల్ వింగ్ వంటి కేటగిరీల వారీగా విభజించారు.