
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బ్రెజిల్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ కాంగ్రెస్‌లో ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అడవుల రక్షణ, పునరుద్ధరణకు అవలంభిస్తున్న సాంకేతిక, తదితర అంశాలపై జరుగుతున్న సదస్సులో రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారి లోకేశ్ జైస్వాల్ పాల్గొన్నారు. గజ్వేల్, ములుగు అటవీ ప్రాంతంలో అడవుల పునరుద్ధరించిన తీరును సమావేశంలో జైస్వాల్ వివరించారు.