జీతాలు ఇక చేతికిచ్చుడు బంద్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్, కాంట్రాక్ట్ కార్మికులకు క్యాష్‌‌‌‌‌‌‌‌ రూపంలో శాలరీలివ్వడం నిషేధం

 జీతాలు ఇక చేతికిచ్చుడు బంద్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్, కాంట్రాక్ట్ కార్మికులకు క్యాష్‌‌‌‌‌‌‌‌ రూపంలో శాలరీలివ్వడం నిషేధం
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బదిలీ లేదా చెక్కుల ద్వారానే ఇవ్వాలి
  • ఆదివారం ‘ఆఫ్’ ఉన్నా జీతం ఫుల్.. అమల్లోకి 
  • 26 రోజుల ఫార్ములాఓవర్‌‌‌‌‌‌‌‌టైమ్ చేస్తే డబుల్ ధమాకా.. పాత జీతాలపై 10 శాతం అదనపు పెంపు 
  • జెండర్ ఏదైనా జీతం ఒక్కటే.. ఏజెన్సీలు ఎగ్గొడితే మెయిన్ కంపెనీదే పూచీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర కార్మిక రంగంలో చరిత్రాత్మక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కార్మికులకు చేతికి నగదు (క్యాష్) రూపంలో జీతాలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధిస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్నది. మే 30న ప్రభుత్వం జారీ చేసిన జీవో  6 ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కాంట్రాక్ట్, ఐటీ ఇలా ఏ రంగంలోనైనా సరే ప్రతి పైసా నేరుగా బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో పడాల్సిందే. ఈ చరిత్రాత్మక నిర్ణయంతోపాటు కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ..సెలవు రోజుల్లో పని చేస్తే డబుల్ జీతం ఇవ్వాలని ప్రభుత్వం రూల్ పెట్టింది.  ఈ కొత్త జీవో ప్రకారం కంపెనీలు జీతాలు లెక్కించేటప్పుడు నెలలో 26 రోజులను మాత్రమే బేస్ చేసుకోవాలి. అంటే కార్మికులకు ఆదివారం వచ్చే వీక్లీ ఆఫ్ రోజుల్లో కూడా జీతం కట్ అవ్వకుండా, ఆ రోజుకు కూడా డబ్బులు కలిపి వస్తాయి. ఒకవేళ ఎవరైనా కార్మికుడు రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేసినా.. లేదా పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో డ్యూటీ చేసినా.. వారికి మామూలు రేటు కంటే రెండు రెట్లు (డబుల్) ఓవర్‌‌‌‌‌‌‌‌ టైమ్ డబ్బులు ఇవ్వాల్సిందే. ఇక ఎక్కడైనా పాత వేతనాలు ఎక్కువగా ఉంటే.. వాటిని అలాగే ఉంచి, వాటిపై అదనంగా మరో 10 శాతం పెంచి ఇవ్వాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

డ్రోన్లు నడిపేవారికి పండుగే.. డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌కూ రక్షణ!

మన పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రల కంటే తెలంగాణ ఈ విషయంలో ఎంతో ముందుంది. ఇప్పటివరకు చట్టాల పరిధిలోకిరాని అమెజాన్, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ లాంటి ఈ కామర్స్ కొరియర్ సర్వీస్ బాయ్స్, స్విగ్గీ, జొమాటోలాంటి డెలివరీ బాయ్స్, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే ‘గిగ్ వర్కర్స్’ అందరినీ ఈ కనీస వేతన చట్టం పరిధిలోకి తెచ్చి రక్షణ కల్పించింది. ఇక కొత్త టెక్నాలజీ అయిన డ్రోన్లతో పొలాల్లో మందులు చల్లేవారిని ‘హైలీ స్కిల్డ్’ (ఎక్కువ నైపుణ్యం ఉన్నవారు) కేటగిరీ కింద చేర్చి వారికి భారీ వేతనాలు ఖరారు చేసింది. ట్రైనీలు లేదా అప్రెంటిస్‌‌ల పేరుతో తక్కువ జీతాలు ఇచ్చి మోసం చేయకుండా.. వారికి కూడా కనీస వేతనంలో 75 శాతం డబ్బులు కచ్చితంగా ఇవ్వాలని ఆర్డర్ వేసింది. పురుషులు, మహిళలతోపాటు ట్రాన్స్‌‌జెండర్లు, దివ్యాంగులకు కూడా ఒకేలాంటి పనికి సమానమైన జీతం ఇవ్వాలని రూల్ పెట్టింది. ఒకవేళ మధ్యలో ఉన్న సబ్‌‌ కాంట్రాక్టర్ లేదా ఏజెన్సీ సరిగ్గా జీతాలు ఇవ్వకపోతే.. మెయిన్ కంపెనీ యాజమాన్యమే (ప్రిన్సిపల్ ఎంప్లాయర్) నేరుగా బాధ్యత తీసుకుని కార్మికులకు జీతాలు సెటిల్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, కేంద్ర ప్రభుత్వ కొత్త వేతన చట్టం (కోడ్ ఆన్ వేజెస్, 2019) స్ఫూర్తితో.. బ్రిటిష్ కాలం నాటి పాత కనీస వేతన చట్టాన్ని రద్దు చేస్తూ ఈ సరికొత్త ఆర్డర్‌‌ను తెచ్చింది. ఇప్పటివరకు పరిశ్రమల వారీగా ఉన్న వందలాది గందరగోళ రూల్స్‌‌ను పక్కన పెట్టేసి, అందరికీ ఈజీగా అర్థమయ్యే ఒకే ఒక సింపుల్ నిబంధనల గ్రిడ్‌‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఒక్క నిర్ణయంతో కార్మికులకు పూర్తి ఆర్థిక రక్షణ దొరకడమే కాకుండా.. ఎలాంటి లీగల్ తలనొప్పులు, గందరగోళం లేకుండా చేసింది. 

కంపెనీలకూ హ్యాపీ.. క్లియర్ కట్ బడ్జెట్!

పరిశ్రమలు పెట్టే యాజమాన్యాలకు కూడా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. వందలాది పాత చట్టాలు, రూల్స్‌‌ను తీసేసి అందరికీ అర్థమయ్యేలా ఒకే ఒక సింపుల్ ‘కంప్లయన్స్ మ్యాట్రిక్స్’ను తెచ్చింది. దీనివల్ల కంపెనీలకు లీగల్ ఖర్చులు, తలనొప్పులు తప్పుతాయి. అలాగే, కంపెనీల్లో ప్రతి 6  నెలలకోసారి పెరిగే కరువు భత్యం (వీడీఏ) కోసం ఒక పక్కా మ్యాథమెటికల్ ఫార్ములాను ఫైనల్ చేశారు. దీనివల్ల ఐదేండ్ల వరకు తమ కంపెనీకి ఎంత ఖర్చు అవుతుందో కార్పొరేట్ ఫైనాన్స్ అధికారులు ముందే అంచనా వేసుకోవచ్చు. పెద్ద కంపెనీలు నగరాల్లో ఆఫీసులు పెట్టుకొని.. టెక్స్‌‌టైల్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌‌లాంటి ఎక్కువ మంది కార్మికులు కావాల్సిన ప్లాంట్లను తక్కువ ఖర్చుండే పల్లెటూళ్లలో (జోన్- 3) పెట్టుకునేలా రూట్ క్లియర్ చేశారు.

డ్రోన్లు నడిపేవారికి పండుగే.. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్‌‌కు కూడా రక్షణ!

మన పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రల కంటే తెలంగాణ ఈ విషయంలో ఎంతో ముందుంది. ఇప్పటివరకు చట్టాల పరిధిలోకిరాని అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ లాంటి ఈ కామర్స్ డెలివరీ బాయ్స్, స్విగ్గీ, జొమాటోలాంటి కొరియర్ సర్వీస్ బాయ్స్, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే ‘గిగ్ వర్కర్స్’ అందరినీ ఈ కనీస వేతన చట్టం పరిధిలోకి తెచ్చి రక్షణ కల్పించింది. ఇక కొత్త టెక్నాలజీ అయిన డ్రోన్లతో పొలాల్లో మందులు చల్లేవారిని ‘హైలీ స్కిల్డ్’ (ఎక్కువ నైపుణ్యం ఉన్నవారు) కేటగిరీ కింద చేర్చి వారికి భారీ వేతనాలు ఖరారు చేసింది.