రాష్ట్ర‌ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు

రాష్ట్ర‌ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు

రాష్ట్ర‌ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, జేఎన్ ‌టీయూ, ప్రగతినగర్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఈసీఐఎల్‌, చిక్కడపల్లి, బాలానగర్‌లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ప‌లుచోట్ల భారీగా వ‌ర్షం కుర‌వ‌డంతో చెరువుల్లోకి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం చేరుతుంది.

మధ్యాహ్నం మూడు గంటల వరకు సంగారెడ్డి జిల్లా అన్నసాగర్ లో 15.3 సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 12 సెం.మీ, కామారెడ్డి జిల్లా సోమూర్ లో 10.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా సీతారామపట్నంలో 9.6 సెం.మీ, మేడ్చల్‌ జిల్లా బాలానగర్ ‌లో 8.7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కాంగెటిలో 8.7 సెం.మీ, కామారెడ్డి బిచుకుందా 8.6 సెం.మీల వర్షపాతం నమోదైంది.