సుజనా గ్రూప్ డైరెక్టర్లకు ఎదురు దెబ్బ

సుజనా గ్రూప్ డైరెక్టర్లకు ఎదురు దెబ్బ
  • అరెస్టుకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు
  • డైరెక్టర్ల పిటిషన్లు కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: సుజనా గ్రూపు పరిధిలోని కంపెనీల డైరెక్టర్లను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టి వేసింది. అరెస్ట్‌‌ చేయడమనేది దర్యాప్తులో భాగమేనని, అందుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలివ్వలేమని న్యాయమూర్తులు జస్టిస్‌‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌‌ పి -.కేశవరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెల్లడించింది. సుజనా యూనివర్సల్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరాజు,ఇన్ఫినిటీ మెటల్‌‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌‌ డైరెక్టర్‌ పి .వి.రమణారెడ్డి , హిందుస్థాన్‌ ఇస్పాత్‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ డైరెక్టర్‌ బి.వెంకట సత్య ధర్మావతార్, ఈబీసీ బేరింగ్స్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ డైరెక్టర్‌ బాలకృష్ణమూర్తిలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై గతంలోనే వాదనలు ముగియడంతో గురువారం హైకోర్టు తుది తీర్పునిచ్చిం ది.ఇన్‌ పుట్‌‌ ట్యాక్స్‌‌ క్రెడిట్‌‌ కింద రూ.225కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందినట్లున్న అభియోగాలున్న నిందితులపై అధికారుల దర్యాప్తుకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరినట్లు తీర్పునివ్వడం జీఎస్టీ స్ఫూర్తి ని దెబ్బతీసినట్లవుతుందని తేల్చి చెప్పింది.