ఫస్ట్ ఇలా : వ్యూహం సినిమాపై హైకోర్టు కమిటీ

ఫస్ట్ ఇలా : వ్యూహం సినిమాపై హైకోర్టు కమిటీ

రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కించిన వ్యూహం(Vyooham) సినిమా రిలీజ్ విషయంలో తెలంగాణ హైకోర్టు  కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ కమిటీలో ఎవరు ఉండాలనేది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయాన్ని 12 గంటల లోపు తమకు తెలుపాలని తెలిపింది. గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందన్న హైకోర్ట్.. అలాంటి కమిటీని ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని స్పష్టం చేసింది. 

పిటిషనర్, ప్రతివాదులు కలిసి ఏర్పాటు చేసుకున్న కమిటీకి వ్యూహం సినిమాను చూపించాలని, సినిమాపై రిపోర్ట్ ను శుక్రవారం లోపు కోర్ట్ కు సమర్పించాలనీ హై కోర్టు ఆదేశించింది. అనంతంర వ్యూహం విచారణను 12 గంటలకు వాయిదావేసింది. ఇక వ్యూహం సినిమా వివాదం విషయానికి వస్తే.. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యూహం సినిమా తీశారని పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేశ్‌. దీంతో వ్యూహం సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది.