
టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కు హై కోర్ట్ లో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలంద మీడియా సంస్థ.. రవి ప్రకాష్ ఫోర్జరీ, నిధుల మళ్లింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో ఆయనపై మూడు ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసులపై రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. వారానికోసారి పోలీసుల ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.