బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వండి : హైకోర్టు

బర్రెలక్కకు సెక్యూరిటీ ఇవ్వండి : హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం పోటీ ఆసక్తిగా మారింది. కారణం అక్కడి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష కావటమే. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బర్రెలక్క.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటంతో.. అటెన్షన్ పెరిగింది. ఈ క్రమంలోనే బర్రెలక్క తమ్ముడిపై కొందరు వ్యక్తులు దాడి చేయటం సంచలనంగా మారింది. పోలీసులు భద్రత ఇవ్వటం లేదంటూ హైకోర్టులో పిటీషన్ వేశారామె. అంతే కాకుండా ప్రచారం చేయొద్దని.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు కోర్టుకు వెళ్లారామె. 

పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్క అలియాస్ శిరీష కుటుంబం మొత్తానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా సమాచారం ఇచ్చింది. బర్రెలక్క శిరీష్ ప్రచారం చేసే సమయంలోనూ రక్షణ ఇవ్వాలని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థి భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని వ్యాఖ్యానించింది హైకోర్టు.