
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు PSలో కేటీఆర్పై నమోదైన FIRను హైకోర్టు కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై ఉట్నూరు పీఎస్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మూసీ ప్రక్షాళనలో లక్షా 50 వేల కోట్ల స్కామ్ ఉందని.. అందులో పాతిక వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మురికి కూపంలో కూరుకుపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. లక్షా 50 వేల కోట్లతో మూసీని తీర్చిదిద్దుతామని సీఎం, మంత్రులు ప్రకటించారు. అయితే.. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ భారీ స్కామ్‌కు పాల్పడుతోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా.. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ కొట్టేయడంతో బీఆర్ఎస్కు ఊరట లభించినట్టయింది.
►ALSO READ | ఇంగ్లీష్‌లో ‘నేను చిందుల ఎల్లమ్మ’ ..పుస్తకాన్ని ఆవిష్కరించిన వక్తలు