ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రపతి, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయంటూ 226 మంది టీచర్లు వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. అయితే పిటిషన్లపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
