భూముల వేలంపై సర్కారుకు ఎదురు దెబ్బ

భూముల వేలంపై సర్కారుకు ఎదురు దెబ్బ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​లో చేపట్టిన భూముల అమ్మకానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని 301 సర్వే నంబర్‌లో 42 ఎకరాలను వేలం వేయొద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే రెండు కేసుల్లో అక్కడి భూములను వేలం వేయరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. కాందిశీకులకు ఇచ్చిన భూమిని వేలం వేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నారాయణ్‌దాస్‌ రిజ్వాని వేసిన రిట్‌ను మంగళవారం హైకోర్టు విచారించి స్టే ఆదేశాలిచ్చింది. ఈ మేరకు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు వెల్లడించింది.