
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాము దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న సీఎం కేసీఆర్‌కు నోటీసు జారీ చేయాలని భారత్‌ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్‌వెల్లపల్లి తరఫు సీనియర్‌న్యాయవాది హెగ్డే హైకోర్టును కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మొయినాబాద్‌పీఎస్‌లో కేసు నమోదు దశలోనే కేసీఆర్‌మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారని, తాము దాఖలు చేసిన కేసులో ప్రతివాదిగా ఉన్న ఆయనకు నోటీసులు జారీ చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌కూడా కౌంటర్‌దాఖలు చేసేలా నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ వినతిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌బి.విజయ్‌సేన్‌రెడ్డి స్పందిస్తూ, ఏం చెప్పదల్చుకున్నదీ కౌంటర్‌దాఖలు చేసేయవచ్చు కదా అని ప్రభుత్వం తరఫున వాదించే అదనపు ఏజీ జె.రామచంద్రరావును ప్రశ్నించారు. నోటీసు జారీ చేయాలన్న వినతిపై తమకు అభ్యంతర ఉందని, అభ్యంతరాలకు అనుగుణంగా అఫిడవిట్‌దాఖలు చేస్తామని అదనపు ఏజీ జవాబు చెప్పారు. సిట్, రాష్ట్ర సర్కార్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌అడ్వొకేట్‌దుష్యంత్‌దవే వాదిస్తూ, ఈ కేసులేమీ అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులోని ముగ్గురు నిందితులు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారని, వాళ్ల కేసును మాత్రమే 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
పిటిషనర్ హక్కులు హరిస్తున్న సిట్
సిట్ దాఖలు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలైన వేర్వేరు రిట్‌పిటిషన్లను జస్టిస్‌బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లాయర్‌బి.శ్రీనివాస్‌తరఫున కర్నాటక మాజీ ఏజీ, సీనియర్ న్యాయవాది ఉదయ్ హళ్లే వాదిస్తూ, ఎమ్మెల్యేల ఎర కేసుకు పిటిషనర్ శ్రీనివాస్‌కు ఏ సంబంధం లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో శ్రీనివాస్ పేరు కూడా లేదన్నారు. విచారణకు పిలిస్తే సిట్‌ఎదుట హాజరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ దర్యాప్తు అధికారులు ఒత్తిడి చేశారని చెప్పారు. సిట్ దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందన్నారు. ఫిర్యాదు చేసిన వాళ్లు, దర్యాప్తు చేస్తున్నవాళ్లు, మధ్యవర్తులు, సాక్షులు, సిట్‌కు ఆదేశించిన వాళ్లు అందరూ ఒకే తానులోని వాళ్లని, దర్యాప్తు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా చేయాలనే తీరులో పక్షపాతంగా సాగుతోందన్నారు. తక్షణమే సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా శ్రీనివాస్‌కు నోటీసు ఇవ్వడానికి ఆయన ఇంటికి ఏకంగా 34 మంది పోలీసులు వెళ్లి హంగామా చేశారని, ఇంటి దగ్గర నోటీసు అంటించి పత్రికలకు ప్రకటనలు, ఫొటోలు రిలీజ్ చేశారని చెప్పారు. సీఎం నిర్ధేశించిన మేరకే సిట్ దర్యాప్తు జరుగుతోందన్నారు. దవే వాదనలు కొనసాగిస్తూ, సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు అనేక కేసులు దాఖలైతున్నాయని చెప్పారు. సిట్ దర్యాప్తు సత్వరమే పూర్తి అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ ఆన్‌లైన్‌లో కేసు విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకుని తగిన నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.