బొకే అందివ్వలేదని.. గన్​మెన్‌‌పై చేయిచేసుకున్నహోంమంత్రి

బొకే అందివ్వలేదని.. గన్​మెన్‌‌పై చేయిచేసుకున్నహోంమంత్రి
  • అందరూ చూస్తుండగానే  చెంప దెబ్బ కొట్టిన మహమూద్‌‌ అలీ

హైదరాబాద్‌‌, వెలుగు:  హోం మంత్రి మహమూద్‌‌ అలీ తన గన్‌‌మెన్‌‌పై చేయి చేసుకున్నారు. అడిగిన వెంటనే బొకే అందివ్వలేదనే కోపంతో గన్‌‌మెన్‌‌ చెంప చెల్లుమనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ చూస్తుండగా గన్‌‌మెన్‌‌పై చేయిచేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. శుక్రవారం అమీర్‌‌‌‌పేట్‌‌లోని డీకే రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్కూల్‌‌లో ‘బ్రేక్‌‌ ఫాస్ట్’కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌తో పాటు మహమూద్‌‌ అలీ హాజరయ్యారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌‌ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శుక్రవారం మంత్రి తలసాని పుట్టినరోజు కావడంతో మహమూద్‌‌‌‌‌‌‌‌ అలీ ఆయనను ఆలింగనం చేసుకొని, అభినందించారు. ఈ క్రమంలో బొకే ఎక్కడా? అని తన గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ బాబు నాయక్‌‌‌‌‌‌‌‌ను మంత్రి అడగగా, తనకు తెలియదని గన్‌‌‌‌‌‌‌‌మెన్ చెప్పడంతో మహమూద్‌‌‌‌‌‌‌‌ అలీ తీవ్ర అసహనానికి గురయ్యారు. అందరూ చూస్తుండగానే గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌పై చేయి చేసుకున్నారు. మంత్రి చేసిన పనికి అక్కడున్న వారంతా షాకయ్యారు. వెంటనే తలసాని కలగజేసుకొని మహమూద్‌‌‌‌‌‌‌‌ అలీని శాంతింపజేశారు. అదే సమయంలో అక్కడున్న హోం మంత్రి పీఆర్వో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రావు బొకే తెచ్చి ఇవ్వడంతో, దానిని తలసానికి ఇచ్చి, బర్త్‌‌‌‌‌‌‌‌డే విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 

పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కే అవమానకరం..

గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ బాబు నాయక్‌‌‌‌‌‌‌‌ను హోం మంత్రి కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తనకు రక్షణ కల్పించే సిబ్బందిపై ఇలా దాడి చేయడం పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు అవమానకరమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారని నిరంతరం చెప్పే హోం మంత్రి తన గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌పై చేయి చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌‌‌‌‌‌‌‌ ఈ ఘటనను అవమానకరంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సదరు గన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌  గానీ, పోలీస్‌‌‌‌‌‌‌‌ యూనియన్స్‌‌‌‌‌‌‌‌, అధికారులు గానీ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.