
వరంగల్: TS ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్. MBA, MCA కోర్సుల్లో ఎంట్రీలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాలులో శుక్రవారం ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్, కేయూ వీసీ ఆచార్య ఆర్.సాయన్న విడుదల చేశారు. గత నెల 23, 24 తేదీల్లో మొత్తం 58 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను నిర్వహించగా.. 49వేల మంది విద్యార్థులు రాశారు.