హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేయడంపై మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ (ఎంఈసీసీ) హర్షం వ్యక్తం చేసింది.
ఈ నిర్ణయం సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో కీలక ముందడుగని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు, ఉద్యోగులు కలిశారు.
