హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నవంబర్ 4 నుంచి 9 వరకు జరగనుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్య ఇచ్చే ఈ టోర్నీ పోస్టర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శాట్జ్ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, శాట్జ్ వీసీ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
