
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలను మంగళవారం (మే 9వ తేదీన) విడుదల చేయనున్నారు. ఇంటర్, ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను మే 9వ తేదీ ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.