రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు

రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలపై గందరగోళంలో ఉన్న స్టూడెంట్స్ కి రిజల్ట్స్ పై క్లారిటీ ఇచ్చింది బోర్డు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫలితాలపై పలుసార్లు తేదీలు రావడంతో వీటిని కొట్టిపారేసింది బోర్డు. వాట్సాప్ లో వచ్చిన తేదీలు అవాస్తవమని గతంలోనే చెప్పిన బోర్డు అధికారులు..త్వరలోనే అఫీషియల్ డేట్ ను అనౌన్స్ చేస్తామన్నారు.

బుధవారం ఈ సందర్భంగా ఓ లెటర్ ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు..ఫలితాలను గురువారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు అధికారులు. ఫిబ్రవరి 27నుంచి మార్చి 16వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు.

రిజల్ట్స్ కోసం పలు వెబ్ సైట్లలో ఆన్ లైన్ లో చూసుకోవచ్చని సూచించింది.

వెబ్ సైట్ వివరాలు..WWW.bie.telangana.gov.inచూడవచ్చని తెలిపింది.