
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఫలితాలను రిలీజ్ చేశారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది పాసైనట్లు తెలిపారు అశోక్.
సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,60,487 విద్యార్థులు హాజరుకాగా.. 60,600 మంది పాసయ్యారన్నారు. 63308 మంది బాలికలు హాజరుకాగా.. 26, 181 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అశోక్ తెలిపారు. బాలురలో 97179 మందికి గానూ.. 34490 మంది పాసయ్యారన్నారు.