తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను  ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవుతాయి.ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి. 

ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. రెండు విడుతలుగా అంటే ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల  టైంటేబుల్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది.