వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!

వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఎగ్జామ్ పేపర్స్ రివాల్యూషన్ పూర్తైయినప్పటికీ ఫలితాల విడుదల గురించి ఇంకా బోర్డు అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్‌ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టెక్నికల్ గా రిజల్ట్స్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి 4 విడతల్లో రివాల్యూషన్ పూర్తి చేశారు.

ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించగా.. వీరిలో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి ఇస్తే ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 25లోపు ఫలితాల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.